
ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్..
(పయనించే సూర్యుడు నవంబర్ 7 రాజేష్)
దౌల్తాబాద్ మండల కేంద్రములోని ఆదర్శ పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ సిద్దిపేట జిల్లా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో,పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్గారి అధ్యక్షతన క్విజ్ పోటీలు జరిగాయి.తెలుగు ఉపాధ్యాయులు నరేందర్ క్విజ్ పోటీలలో భాగంగా 6 నుండి 10 తరగతుల విద్యార్థులను ఐదు గ్రూపు లుగా విభజించి, ఒక్కొక్క గ్రూపుకు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, వాల్మీకి, వ్యాసుడు అని పేర్లు పెట్టి క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాల్మీకి గ్రూపు సభ్యులు ….ఈ పోటీలో అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రథమ స్థానంలో నిలిచారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం , భావజాలం, విజ్ఞానపరమైన అంశాలపై ఆసక్తి పెరిగిందని సత్యసాయి ట్రస్టు వారిని అభినందించారు.తెలుగు ఉపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ ఇతిహాసాలు, పురాణాలు, మతసామరస్యం, పుణ్యక్షేత్రాలు వంటి అంశాలపై విద్యార్థులకు మంచి పట్టు వచ్చిందని, ఎంతో ఆతృతతో ఆసక్తితో చదివారని, సత్యసాయి ట్రస్టు వారిని అభినందించారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని వారిని కోరారు..గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో తిరుపతి, శివకృష్ణ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
