
సంగారెడ్డి జిల్లా పయాణించే సూర్యుడు 7
హోప్ న్యూరో హాస్పిటల్ ఎం. డీ. డాక్టర్ కృష్ణ మూర్తి
తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు నవంబర్ 10,11 తేదీలో సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను జయప్రదం చేయాలి హోప్ న్యూరో హాస్పిటల్ ఎం. డీ. కృష్ణ మూర్తి అన్నారు శుక్రవారం టోర్నమెంట్ కి సంబందించిన కరపత్రం ఆయన విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు చింతల సాయి కుమార్, ఎస్. సి. ఎస్. టి. అట్రాసిటీ విజిలెన్స్, & మానిటరీ కమిటీ సభ్యులు కాశాపగా ఇమ్మయ్య తదితరులు పాల్గొన్నారు..