
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో టీఎస్ ఆర్ టి సి ఆర్ ఎం
సంస్థాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలి ఆర్.ఎం. మేడమ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజినల్ మేనేజర్, టి. జొప్నా ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి చెందిన త్రైమాసిక ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం నిజామాబాద్ డిపో-1లో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రీజియన్ మేనేజర్ మేడమ్ హాజరై, ఆయిల్ సేవింగ్, ఆదాయ వృద్ధి, ఉత్తమ ప్రదర్శనలో విశేష ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, టైం డ్రైవర్లు, పీహెచ్బీ డ్రైవర్లు, టెక్నీషియన్లు మరియు శ్రామికులకు సర్టిఫికేట్లు మరియు నగదు బహుమతులు ప్రదానం చేశారు.ఆర్.ఎం. మేడమ్ మాట్లాడుతూ "సంస్థ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి పాత్రి ఎంతో విలువైనది. క్రమశిక్షణ, సేవాభావం, సురక్షిత ప్రయాణం, ఇవే సంస్థ బలాలు. ఈ అవార్డులు మీ కృషికి గుర్తింపు మాత్రమే కాదు, ఇతరులకు ప్రేరణ కూడా కావాలి' అని అభినందించారు.కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ యస్, మాధుసూదన్ , P.O . పద్మజ అన్ని డిపో మేనేజర్లు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేసారు.