
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 25 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు 7) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో సొమ్ము మాది కాదు కదా ప్రజల సొమ్ము ఏమైతే మాకేంటి అనే ధోరణి లో కాలాన్ని సాగదీస్తున్న కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వాళ్ళుచేస్తే తప్పు కాదు మేము చేస్తే తప్పా? అనే రీతిలో ప్రయత్నాలు సాగిస్తున్న కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం పేర్లు మార్పిడికే లక్ష కోట్లలో ఖర్చు పెట్టారు అది తప్పు కానప్పుడు మా కూటమి ప్రభుత్వం చేస్తే తప్పా? అని కూటమి నాయకులు అంటున్నారు ఇలాంటి ప్రభుత్వాల్ని ఏం చేయాలో ఒక్కసారి ప్రజల ఆలోచించండి 24.9.2026.. టిడ్కోఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థగా ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి అని ఈ పేరును చూస్తేనే అర్థమవుతుంది అలాంటప్పుడు ప్రజలకు పూర్తిస్థాయిలో ఈ టిడ్కో ఇళ్లను మన సమీప పట్టణమైన నాయుడుపేటలో పూర్తిస్థాయిలో ఇవ్వగలిగిన కూటమి ప్రభుత్వం సూళ్లూరుపేట పట్టణ వాసులకు మాత్రం ఆ ఇళ్లను అందని ద్రాక్షగా చేసి లేటుగా కొంతమందికి మాత్రమే ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో నాటి జయలలిత ప్రభుత్వం ఓటమి చెంది స్టాలిన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం మునుపటి ప్రభుత్వం ప్రజలకు అందించవలసిన పిల్లల బ్యాగు వాటి పేరును మార్చకుండానే మరియు ప్రతి ఊరిలోనూ ప్రజలకు అతి తక్కువ ధరతో ఇస్తున్న అమ్మ క్యాంటీన్ పేరును కూడా మార్చకుండా ఆ పథకాలను యధావిధిగా కొనసాగించి రాజకీయాలలో ప్రజల ధనాలను వృధా చేయకుండా చాలా గౌరవంగా నడుచుకున్నారు తమిళనాడు స్టాలిన్ పార్టీవారు.. కానీ మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పేర్ల మార్పిడికి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు అలా ఖర్చు పెట్టే డబ్బును ఈ టిడ్కో ఇళ్లకు ఖర్చుపెట్టి ఉంటే ఎప్పుడో గృహప్రవేశాలు పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులోకి వచ్చి ఉండేవి కదా నిజంగా ప్రభుత్వం పేర్ల మార్పిడిలోనే తమ ఆలోచనను ముడిపెట్టి జరుపుకుంటూ వచ్చింది మొదట సచివాలయం పేర్లను మార్చడం నుంచి నేటి ఈ గృహప్రవేశాలకు కాయితాల పేర్లను కూడా మార్చి ఇవ్వడానికి ప్రయత్నించడంలో అత్యధిక ప్రజాధనం వృధా చేశారని ఇందులో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసిన వారవుతారని నిన్నటి కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఈ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై నిందిస్తూ వెళ్లారు... ప్రభుత్వాలు మారినా వారు చేసే పథకాలకు ఖర్చు ప్రజల సొమ్మన్న సంగతి పార్టీలు మరిచిపోయి తమ సొంత సొమ్మునే ఖర్చు పెడుతున్నట్లు వారి పేర్లను వారి పేర్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు మునుపు హద్దురాళ్లకు నాటి ప్రభుత్వం పేర్లు రాసి ఖర్చు పెట్టింది అని చెప్పి నిందించిన కూటమి ప్రభుత్వ నాయకులు నేడు టిడ్కో ఇళ్లకు ఇచ్చిన కాగితాల పేర్లు మార్పిడి చూస్తుంటే వారికి (జగన్ పార్టీ& కూటమి పార్టీ)వీరికి తేడా లేదు కదా వృధా అయినది ప్రజల సొమ్మే కదా అని ప్రజలు వాపోతున్నారు..?
