
{పయనించే సూర్యుడు} {నవంబర్ 8} మక్తల్}
లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో ప్రోగ్రాం చైర్మన్ అనుగొండ శ్రీనివాసులు, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యాంజనేయులు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 80 మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించగా… కంటి శస్త్ర చికిత్స అవసరమైన 40 మందిని పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వేలాదిమందికి ఉచిత కంటి చికిత్సలు నిర్వహించామని, దీంతోపాటు ఇతర సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ అంజన్ ప్రసాద్, కోశాధికారి ఆడెం సత్యనారాయణ, జోనల్ చైర్మన్ సూగురు జైపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మామిళ్ల పృథ్వీరాజ్, సీనియర్ సభ్యులు డాక్టర్ శ్రీరామ్, రమేష్ రావు, బి.అంబాదాస్ రావు, బి. రమేష్, కంటి వైద్య నిపుణులు జ్యోతి, సిబ్బంది ఖాజా తదితరులు పాల్గొన్నారు.
