
మక్తల్ సీఐ రామ్ లాల్
{పయనించే సూర్యుడు} {నవంబర్ 8}మక్తల్}
మక్తల్ మండలం జక్లైర్ పరిధిలో రోడ్డుప్రమాదాలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే బాధ్యతతో జక్లైర్కు చెందిన వెంకటేష్ గౌడ్ సమాజ సేవలో భాగంగా 4 నూతన ట్రాఫిక్ బారికేడ్లను విరాళంగా అందించారు. ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి ఇలాంటి సేవ చేయడం చాలా ఆదర్శప్రాయమని మక్తల్ సీఐ రామ్ లాల్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా జక్లైర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మక్తల్ సీఐ రామ్‌లాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…జక్లైర్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై రోజూ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని,
ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని,ఈ విరాళం ద్వారా రహదారి భద్రత మరింత మెరుగుపడుతుందని సీఐ తెలిపారు. వెంకటేష్ గౌడ్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ, “సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో యువత ముందుకు రావడం పోలీసు శాఖకి, సమాజానికి ప్రేరణగా ఉంటుందని. ప్రజల భద్రత కోసం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు.విరాళంగా అందించిన 4 బారికేడ్లను జక్లైర్ వద్ద ప్రమాదాలకు గురయ్యే పాయింట్ల వద్ద తక్షణమే ఉపయోగంలోకి తీసుకువస్తామని సీఐ రామ్‌లాల్ తెలిపారు. బారికేడ్లు అమలు చేయడం ద్వారా వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాల తగ్గింపు, రాత్రి వేళల్లో విజిబిలిటీ పెరగడంలో విశేష ప్రయోజనం ఉంటుందని తెలియజేశారు.జిల్లా పోలీస్ శాఖ ప్రజల సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను నివారించవచ్చని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, జక్లేర్ గ్రామ యువత పాల్గొన్నారు.