
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరు దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఓరంటి హోటల్ సందునందు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నది సూళ్లూరుపేటకు ఉన్న విద్యుత్ అధికారులు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారు ప్రమాదాల్ని గుర్తించలేని స్థితిలో ఉన్న ఎలక్ట్రికల్ ఏఈ ఎలక్ట్రిక్ ఏ డి. ప్రమాదాలు జరిగిన తర్వాత చూసుకునే దానికన్నా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించండి
బఫర్ జోన్ బిల్డింగ్స్అనుమతించకూడదు అని తెలిసినా అనుమతి ఇచ్చారంటే మున్సిపాలిటీ అధికారుల అధికార దుర్వినియోగానికి ఇదో నిదర్శనం అనే చెప్పాలి ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఈ ప్రదేశంలో ఒక ట్రాన్స్ఫార్మర్ను కూడా భద్రతాపరమైన చర్యలు లేకుండా ఇక్కడ ఉంచారు అంటే ఇందు లో విద్యుత్ శాఖ వారి వైఫల్యం తెలుస్తూ నే ఉంది.. ఈ అధికార దుర్వినియోగం మరియు వైఫల్యాలు ఎక్కడో కాదండి మన సుళూరుపేటలోని నెర్రి కాలువ గట్టులోనే ఒక విధంగా చూస్తే కాలువ లోపల్నుంచి పిల్లర్లతో బిల్డింగు కడుతున్నారు ఆ ప్రదేశానికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంచి ఉన్నారు ఇలాంటి భద్రత వైఫల్యం తో మరొకటి సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని నడిబొడ్డున ఉన్న హోలీ క్రాస్ జంక్షన్ పెట్రోల్ బంక్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నది దీనిని గురించి కూడా విద్యుత్ శాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారా లేక మేము చేసే డ్యూటీ ఇంతే అని ఊరుకుంటారా ఈ ప్రాంత ప్రజలు వీటిపై చర్చించుకుంటున్నారు ఉన్నారు