

పట్టించుకునే నాథడే లేరా?...
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం నుండి బోధన్ కు వెళ్లే రోడ్డు దుస్థితి అద్వానంగా తయారైంది. ఈ రోడ్డు దుస్థితి గురించి పట్టించుకునే నాధుడే లేరా అని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి అద్వానంగా తయారయింది. ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు జంకుతున్నారు. ఈ రోడ్డు పై నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు మరింత ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమత్తులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.