
{ పయనించే సూర్యుడు} {నవంబర్ 8}మక్తల్
నారాయణ పేట్ జిల్లా స్థానిక మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ పడమటి అంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మందిరంలో తేదీ: 16 -11 -2025 ఆది వారం రోజు ఉదయం 9:30 గంటలకు గీతా జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్,భజరంగదళ్ ఆధ్వర్యంలో
విద్యార్థులకు 5 స్థాయిలలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించబడును. మక్తల్,మాగనూరు, కృష్ణ మండలాలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చును. విద్యార్థులు భగవద్గీతలోని 6 వ అధ్యాయము - ఆత్మ సన్యాసయోగంలోని శ్లోకాలు కంఠస్థంగా చెప్పవలెను ప్రతి పాఠశాల/ కళాశాల నుండి ప్రతి స్థాయిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది. విద్యార్థులను ఆయా పాఠశాల,కళాశాల ఉపాధ్యాయులు తమ వెంట తీసుకొని రాగలరు.శిశు స్థాయిలో - పూర్వశిశు, 1 వ మరియు 2 వ తరగతి విద్యార్థులు 1 వ శ్లోకం నుండి 5 వ శ్లోకం వరకు, ప్రాథమిక స్థాయిలో - 3,4,మరియు 5 వ తరగతి విద్యార్థులు 1 వ శ్లోకం నుండి 10 వ శ్లోకం వరకు, మాధ్యమిక స్థాయిలో 6,7 వ తరగతి విద్యార్థులు 1 వ శ్లోకము నుండి 15వ శ్లోకం వరకు, ఉన్నత స్థాయిలో 8,9, మరియు 10 వ తరగతి విద్యార్థులు 1 వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు, కళాశాల స్థాయిలో- ఇంటర్ మరియు ఆపై స్థాయి విద్యార్థులు 1 వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు విద్యార్థులు శ్లోకాలను కంఠస్థముగా చెప్పవలసి ఉంటుంది. ఇట్టి పోటీలలో పాల్గొనే వారు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు: 9966703040, 8019249123, 9182689206, 8520026647 భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించ స్థలము : శ్రీ షిరిడి సాయి- సత్య సాయి మందిరము రాయచూరు రోడ్డు మక్తల్. తేదీ:16-11-2024 ఆది వారం రోజు ఉదయము 9:30 గంటలకు* ఈ పోటీలలో మక్తల్, మాగనూరు ,మరియు కృష్ణ మండలాలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొనవలెను.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు కే.సత్యనారాయణ గౌడ్, పట్టణ కార్యదర్శి మల్లికార్జున్,బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ భీమేష్,ప్రఖండ సంయోజక్ రాహుల్,సప్తాయి క్ మిలన్ సంయోజక్ పారశురాం, తదితరులు పాల్గొన్నారు
