
రుద్రూర్, నవంబర్ 8(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తి రాము, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, కర్క అశోక్, ఇందూర్ కార్తిక్, పార్వతి ప్రవీణ్, నేరుగంటి బాలరాజు, కిసాన్ ఖేత్ అధ్యక్షులు అడప సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.