
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుబీర్ మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ముధోల్ మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో నిర్మల్ జిల్లా డీసీసీ కార్యదర్శి సూది రాజన్న రూ.55 వేలతో లడ్డూను దక్కించుకున్నారు. వేలం పాటలో భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా ఉండాలని, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.