
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రొద్దుటూరులో దసరా ఘనంగా జరుగుతుందని పేరుంది. ఈ దసరా వేడుకను అందరికీ పరిచయం చేయాడానికి మురళీ కృష్ణ తుమ్మ ప్రొద్దుటూరు దసరా డాక్కుమెంటరీని తెరకెక్కించారు. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్ మీద, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల ఈ డాక్కుమెంటరీని నిర్మించాడు. అక్టోబర్ 31న విడుదలపై ఈ డాక్కుమెంటరీ కొత్త టీం అద్భుతంగా తెరకెక్కించిందనే చెప్పాలి. తాజాగా ప్రొద్దుటూరు దసరా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది. నవంబర్ 7 నుంచి ఈటీవీ విన్ లో ప్రసారం అవుతుంది. 40 నిమిషాలు ఉన్న ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరులో జరిగే దసరా వైభావాన్ని తెలియజేసేలా ఉంది. కాగా బాల్కనీ ఒరిజినల్ బ్యానర్ పై మరిన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు రానున్నాయని తెలుస్తుంది. ఈ మూవీకి స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ చేయగా, కిలారి సుబ్బారావు PROగా పని చేశారు. మీరు కూడా ఈ రోజు, రేపు ఖాళీ టైం ఉంటుందని కాబట్టి ఓ సారి ప్రొద్దుటూరులో దసరా వైభవాన్ని చూస్తేయండి.