
రుద్రూర్, పయనించే సూర్యుడు .16.11.2026 న్యూస్ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్త జిలకరి మహేందర్ తండ్రి జిలకరి సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందించి, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కటిక రామరాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరి ప్రశాంత్ గౌడ్, బీజేవైఎం జిల్లా నాయకులు బొజిగొండ అనిల్, బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల నాయకులు జిలకర విజయ్, గాండ్ల ప్రవీణ్, బూత్ అధ్యక్షులు గొల్ల శంకర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.