
రుద్రూర్, పయనించే సూర్యుడు : రుద్రూర్ గ్రామానికి చెందిన డెంగేవార్ వెంకటేష్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధితుడు వెంకటేష్ కు సీఎం సహాయనిది ద్వారా రూ. 5 లక్షల ఎల్ ఓ సి మంజూరు చేయించారు. దీంతో బాధిత కుటుంబీకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాముకు కృతజ్ఞతలు తెలియజేశారు.