
పయనించే సూర్యుడుD.9.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు, చొరవతో భీంగల్ మండలానికి నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 2 కోట్ల 25 లక్షలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి రూ. 1 కోటి 75 లక్షలు మంజూరు కోసం కృషి చేయడం హర్షణీయం.ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భీంగల్ మండల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు, పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కి భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మున్సిపల్ చైర్మన్,బొదిరే నాగమణి స్వామి వైస్ చైర్మన్, చంటి లతా జేజే నరసయ్య మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ గోపాల్ నాయక్ సుంకారి సురేష్ మేకల శ్రీనివాసు భూక్య రవి మరియు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.