
కాకినాడ 27వ డివిజన్లో కుసుమ కుమారి ప్రచారానికి శ్రీకారం పయ నించే సూర్యుడు నవంబర్ 19 మమ్ముడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాకినాడ 27వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్నాధపురం శివాలయం మాజీ చైర్మన్ కాకరపర్తి శ్రీ సత్య హరినాథ్ గారి సతీమణి శ్రీమతి కుసుమ కుమారి గారు కాకినాడ నగర మాజీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో నామినేషన్ వేసి ప్రచారం మొదలుపెట్టారు. రేపు అనగా శుక్రవారం ఉదయం 10.44 గంటలకు మున్సుబ్ గారి తూము వద్ద పెద్దిబట్ల వారి వీధిలో కార్యాలయం ప్రారంభించనున్నారు. కావున మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు విచ్చేసి ఆశీర్వదించి కుసుమ కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాకరపర్తి శ్రీ సత్య హరినాథ్, శ్రీమతి కుసుమ కుమారి కోరారు.