
CITU జిల్లా కోశాధికారి జి. భాస్కర్
(పయనించే సూర్యుడు డిసెంబర్ 2 రాజేష్ దౌల్తాబాద్)
CITU తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.అనంతరం CITU జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ కార్మిక,ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న CITU తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు 2025 డిసెంబర్ 7-9 తేదీల్లో మెదక్ పట్టణంలో జరుగుతున్నాయని తెలిపారు.ఈ మహాసభల సందర్భంగా డిసెంబర్ 7న మెదక్ పట్టణంలో జరిగే కార్మిక మహా ప్రదర్శన - బహిరంగ సభకు కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ బహిరంగసభకు ముఖ్యతిథీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి BV రాఘవులు గారు,CITU అఖిలభారత అధ్యక్షురాలు కే.హేమలత గారు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.ఈ మహాసభలకు అంగన్వాడీ,ఆశా,బీడి, గ్రామ పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, మెడికల్ & హెల్త్, మధ్యాహ్న భోజన,మెప్మా, ఆర్పి,విఓఏ, మరియు ఆటో, హామాలీ,భవన నిర్మాణ, పరిశ్రమలకార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని విమర్శించారు.ఈ కోడ్ ల వలన కార్మికులు అనేక హక్కులను కోల్పోయి బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.పెరుగుతున్న దరులకు అనుకూలంగా కనీస వేతనాలు నెలకు 26000 రూపాయలు అమలు చేయాలని తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ మహాసభలలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు స్వామి,దాదేకాన్, నీకేన్ కాన్ బాలమణి,షాహిన్ సుల్తాన్,కౌసల్య,మంజుల, లక్ష్మి, సుకన్య, కనకలక్ష్మీ,రజిత, లావణ్య బొల్లం రేణుక .తదితరులు పాల్గొన్నారు