
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన కల్లెడ మమత మరియు కల్లెడ రవి కుమార్ లకు మంజూరైన మొత్తం మూడు CMRF చెక్కులను బీజేపీ భీంగల్ మండల అధ్యక్షుడు అరె రవీందర్ అందజేశారు.ఈ సందర్భంగా అరె రవీందర్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నిరంతరం చిత్తశుద్ధితో సేవలందిస్తోందన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.భీంగల్ మండలంలో ఎవరైనా బీజేపీ కార్యకర్తలు లేదా సాధారణ ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అటువంటి ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మరియు నిజామాబాద్ (ఇందూరు) పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నాయకత్వంలో ఎల్లప్పుడూ ప్రజల సేవలో ముందుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెండోరా వీడీసీ చైర్మన్ చేగంటి గంగాధర్,FCS అధ్యక్షుడు ముస్లి ఎర్రన్న,కార్యదర్శి గజానవేణి మోహన్,బీజేపీ జిల్లా నాయకులు నాగార్జున్ రెడ్డి,కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు తక్కూరి అంజయ్య,సీనియర్ నాయకులు పార్వతి శ్రీనివాస్ గౌడ్,బూత్ అధ్యక్షులు వాల్గోట్ బాబూరావు,తక్కూరి రామ్,వాల్గోట్ భాస్కర్,నడుకుడ రమేష్,మోహన్,రాములు,దాస్,రాకేష్,ఆదిత్య,బీజేపీ కార్యకర్తలు,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.