
పయనించే సూర్యుడుD,30,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్, దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఈ నెల 09.10.2026 నుండి 26.10.2026 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను సమర్ధవంతంగా నిర్వహించింది. ఈ దసర ప్రత్యేక ఆపరేషన్లో రీజియన్ పరిధిలోని ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్-1, నిజామాబాద్-2 డిపోల ద్వారా మొత్తం 796 బస్సులను నడిపి 1,15,2676 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ప్రత్యేక బస్సుల నిర్వహణ ద్వారా మొత్తం రూ.1,97,99,000 (రూ.1.97 కోట్లకు పైగా) ఆదాయం సమకూరింది.ఈ సందర్భంగా దసరా పండుగ ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన డిపోమేనేజర్లు, అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అందరికీ టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణమూర్తి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.