
పయ నించే సూర్యుడు సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ఐ పోలవరం మాండల కీ.శే దాట్ల లక్ష్మీపతిరాజు వారి 48వ వర్ధంతి సందర్భంగా మురమళ్లలోని ఆయన నిలువెత్తు విగ్రహానికి ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దాట్ల లక్ష్మీపతిరాజు సమాజ సేవకు,ప్రజా సంక్షేమానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు,ఆయన సేవా స్ఫూర్తిని,ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలోనే ప్రజలకు అండగా ఉంటామని,సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి,దాట్ల సత్యనారాయణ రాజు, దాట్ల రామకృష్ణంరాజు,దంతులూరి శ్రీనుబాబు,లచ్చన్న,దాట్ల పవన్,జంపన క్రిష్ణరాజు,దాట్ల నరసింహబాబు, విజ్జల్ రాజు,వెంట్రు సుధీర్,స్థానిక ప్రజా ప్రతినిధులు,కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,స్థానిక ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.