
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : అఖిల భారత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నవంబర్ 1 న రాంలీల మైదానంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ డీసిసిబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ బయలుదేరిన వారిలో మాజీ విండో చైర్మన్ పత్తి రాము, పార్వతి ప్రవీణ్, మాశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.