
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని కొందాపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సాయిలు చేతుల మీదుగా దూడలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. మూడు నెలలలోపు దూడలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేయడం జరిగిందని పశు వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాషా, అటెండర్ గంగారాం, పశువుల పెంపకందారులు తదితరులు పాల్గొన్నారు.