
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పన్నుల వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పంచాయతీ కార్య దర్శి ప్రేమ్ దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సిబ్బంది ప్రతి దుకాణ సముదాయానికి తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించాలని బకాయిలు చెల్లించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పంచాయతీ సెక్రటరీ తెలిపారు.