
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని దుర్గామాత వద్ద శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మండపం వద్ద అన్నదాత డి. సాయిలు (ఎంఈఓ) భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మాలధారణ స్వాములు, ఆలయ కమిటీ నిర్వాహకులు, సభ్యులు, మహిళలు, అన్నదాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.