అడ్వైజరీ కమిటీ)ఏర్పాటు చేయాలి ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి _
.ఆదివాసీ జేఏసీ,రంపచోడవరం డివిజన్
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 13 రంపచోడవరం.
నిన్న జరిగిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో ఏ పి సి ఎం - చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ వంద శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కేటాయించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, 2000 ల సంవత్సరంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం గిరిజన ప్రయోజనాల కోసం 3జీఒ ని రూపొందించి, ఏజెన్సీ ఉద్యోగాలు స్థానిక ఆదివాసీల కేటాయించామని, న్యాయ సమీక్షలు 3 జీవో రద్దయిందని, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, 3 జి ఒ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి స్వాగతిస్తు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వెంటనే (TAC) ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని అనంతరం 3జీవో పునరుద్ధరణ లో భాగంగా వెంటనే ఏజెన్సీ నియామకాల చట్టాన్ని రూపొందించాలని, ప్రస్తుత మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ ఉద్యోగాలను మినహాయించి, ఏజెన్సీ నియామకాల చట్టం రూపొందించిన అనంతరం, ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని రూపొందించి ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ని చేపట్టే అంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఉద్యమ కార్యాచరణని కొనసాగిస్తుందని తెలియజేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఐటిడిఏ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు కంగల శ్రీనివాసు,మద్దేటి.జగన్నాథ రెడ్డి,కడబాల రాంబాబు,దుర్గ, మట్ల కృష్ణా రెడ్డి, కుంజం అగ్గిదొర,కారం రామన్నదొర,మడకం ప్రసాద్,చవలం శుభకృష్ణ,కత్తుల రమణారెడ్డి,పొడియం శ్రీనుబాబు,పండ పవన్ కుమార్ మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు.