
రుద్రూర్, సెప్టెంబర్ 26 (పయనించే సూర్యుడు న్యూస్): రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ నవయుగ గణేష్ మండలిలో కొలువుతీరిన గణనాథునికి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జన శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం లడ్డు వేలం పాట నిర్వహించగా, మండలంలోని అంబం(ఆర్) గ్రామానికి చెందిన తాహెర్ (ఆంధ్రజ్యోతి రిపోర్టర్) గణనాథుని చేతిలో ఉన్న లడ్డును రూ. 11,111 కైవసం చేసుకున్నారు. ఈ సందర్బంగా తాహేర్ కు గణేష్ మండలి నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి అధ్యక్షులు బద్దం సంజీవరెడ్డి, ప్రశాంత్ గౌడ్, పుట్టి సాగర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.