
దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న మాజీ ఉపసర్పంచ్ కర్ర శ్రీనివాస్ రెడ్డి
పయనించే సూర్యుడు న్యూస్ టవర్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గండ్రవానిగూడెం: గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గండ్రవానిగూడెంలోని దుర్గామాత మండపం వద్ద ఈ రోజు దుర్గామాత అవతారమైన సరస్వతీ దేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దుర్గామాత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థించారు. పూజా కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కర్ర శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.భక్తుల పూజలు, కుంకు మార్చనలతో దుర్గామాత మండపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామ ప్రజలు భక్తితో అమ్మవారిని కొలుస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.