
టీ. కరుణాకర్ నియామకం అభినందనీయం
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 27 షాద్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణ లెక్చరర్ల ఫోరం అనుబంధ సంఘమైన తెలంగాణ స్టేట్ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షాద్‌నగర్ ఏఎంసీ డైరెక్టర్ టీ. కరుణాకర్ నియమితులైన సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆయనను అభినందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరుణాకర్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ లెక్చరర్ల ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకటస్వామి, ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కరుణాకర్‌కు ఈ బాధ్యతలు అప్పగించడాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందించారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా టీ. కరుణాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలంగాణ స్టేట్ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన తెలంగాణ లెక్చరర్ల ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకటస్వామి, అధ్యక్షుడు రామకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.