
పయనించే సూర్యుడు,సెప్టెంబర్24:_ ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులం టీచర్స్ & లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ విప్,ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసి వినతిపత్రం అందజేశారు.గురుకులాల్లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమ వేతనాలు,ఉద్యోగ భద్రత,సేవల క్రమబద్ధీకరణ తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు,జిల్లా తెదేపా అధ్యక్షులు గుత్తుల సాయి వారి సమస్యలను సానుకూలంగా విని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గురుకుల టీచర్స్ & లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.