
పయనించే సూర్యుడు న్యూస్ : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. తన భార్య ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ఓ రచయిత్రి తెలిపారు. అంతేకాకుండా ఆ వెంటనే ఇటీవలే ఆగంతకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను పెళ్లి చేసుకోనున్నారని రచయిత్రి షానన్ వాట్స్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లపై జేడీ వాన్స్ స్పందిస్తూ.. అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఒకే సమాధానంతో అన్ని విమర్శలకు చెక్ పెట్టారు. JD Vance Usha Chilukuri Divorce: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యక్తిగత జీవితంపై ఓ ప్రముఖ రచయిత్రి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆయన మిస్సిసిప్పి యూనివర్సిటీలో జరిగిన టీపీయూఎస్‌ఏ (TPUSA) కార్యక్రమంలో పాల్గొని.. అక్కడే ఎరికా కిర్క్‌నను కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. రచయిత్రి వీరిద్దరి బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరికి త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఆ వెంటనే ఎరికా కిర్క్ పెళ్లి చేసుకుంటారని జోస్యం చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి షానన్ వాట్స్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జేడీ వాన్స్, ఎరికా కిర్క్ ఆలింగనం చేసుకున్న ఫోటోకు బదులిస్తూ.. ఎక్స్ వేదికగా వీరిద్దరూ వచ్చే ఏడాది చివరి నాటికి పెళ్లి చేసుకుంటారని చెప్పారు. అంతకు ముందే జేడీ వాన్స్ తన భార్య ఉషాకు విడాకులు ఇస్తారని.. అదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటిస్తారని పేర్కొన్నారు. రచయిత్రి చేసిన ఈ సంచలన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఏకంగా ఈ పోస్టుకు 8.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.