
పయ నించే సూర్యుడు నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం మురమళ్ళ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ గా గొల్లపల్లి అమూల్య ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆమె కృతజ్ఞత పూర్వకంగా శాసనసభ్యులు మరియు పార్టీ విప్ దాట్ల బుచ్చిబాబును, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయిని కలిసి ఘనంగా సన్మానించారు. తనకు అవకాశం కల్పించిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన అమూల్య జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల పురోగతే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెడతానని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పారదర్శకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమూల్యకు శుభాకాంక్షలు తెలిపారు.