
పయనించే సూర్యుడు నవంబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా శ్రీమతి పాబోలు రోజారాణి మధు గారిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోనసీమ జిల్లాలో మొట్టమొదటి పంచాయతీగా బి.దొడ్డవరం గ్రామం ఏకగ్రీవ ఎన్నికను సాధించి చరిత్ర సృష్టించింది. ఆర్య వైశ్య మహిళకు అవకాశం ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ కంచర్ల బాబి& వాసవి సూరిబాబు మరియు కార్యవర్గం తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి రోజారాణి మధు కృషి చేస్తారని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికతో ఐక్యత చాటిన గ్రామస్తులను అందరూ అభినందించారు. సర్పంచ్ గా ఎన్నికైన రోజారాణి మధుకు గ్రామస్తులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.