
కమలం జోరు - జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలూరి సత్యానందం
పయనించే సూర్యుడు అక్టోబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజవర్గం కొత్తపేట జడ్పీటీసీ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ బాధ్యుడు పాలూరి సత్యానందం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని, పార్టీ పిలుపు మేరకే నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కూటమి విజయానికి దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దంశెట్టి శ్రీనివాసరావు, కేశవరపు సత్యనారాయణ, సిద్ధంశెట్టి గంగారావు, పాలూరి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.