
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వై జంక్షన్ వద్ద గల ట్రక్ పార్క్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడానికి ప్రయత్నిస్తుందని ఆ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారంధర్నా చేపట్టారు. కూకట్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నందున దీనిని స్థానిక ప్రజా ఉపయోగాలకు కేటాయించి పార్కులు వంటివి నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ స్థలం 60 కాలనీలకు అందుబాటులో ఉన్నందున దీనిని విక్రయించే ఆలోచనను ప్రభుత్వం మానుకొని ప్రజవుపయోగాలకు మాత్రమే కేటాయించాలని ఆయన కోరారు. ఒకవేళ ఈ ట్రక్కు పార్కును వేలం వేసినట్లయితే తమ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ ఆరోరా తోపాటు పాతూరు గోపి బొట్టు విష్ణు శ్యామల రాజు తదితరులు పాల్గొన్నారు.