
షాద్నగర్ సీనియర్ జర్నలిస్ట్ కేపీ
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)సమాజంలో కులమత, వర్గ విభేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ భారతీయులుగా కలిసిమెలిసి జీవించాలని సీనియర్ జర్నలిస్ట్ కే.పి ఆకాంక్షించారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వారాహి కాంతారా వినాయకుడిని ఆయన ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి నిర్వాహకుడు సాయిరెడ్డి, యువ నాయకుడు మధు తదితరులు కే.పిని శాలువాతో సత్కరించారు. అనంతరం అర్చకులు ఆయనను ఆధ్యాత్మిక రీతిలో సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను కే.పి ప్రశంసించారు. షాద్నగర్ పట్టణంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించడంలో వివేకానంద సేవా సమితి ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. వినాయకుడి ఆగమనం నుంచి నిమజ్జనం వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సాయి రెడ్డి మిత్ర బృందం విస్తృత ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.