
పయ నించే సూర్యుడు నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సౌకర్యాలను కుండలేశ్వరం గ్రామస్తులు ఆర్థిక సహాయంతో 30 రోజులు ఏర్పాటు చేశామని కుండలేశ్వరం సొసైటీ అధ్యక్షులు గంగుమళ్ల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల ఇంచార్జ్ దాట్ల పవన్, కాట్రేనికోన ఎంపిటిసి పిఎస్ఎన్ రాజు, వంగ దుర్గ బాబు, మోటేపల్లి శ్రీనివాస్, గంగుమళ్ల భద్రరావు, శంకర్, చింతలపూడి బాబి, మొటేపల్లి శివ, వరసాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో అన్నదానం ఎంతో పుణ్యఫలం ఇస్తుందని నాయకులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొని భక్తిభావంతో కార్యక్రమం సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు.