
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు తన నిత్య జీవనం సాగించడానికి సహకారంగా లయన్ శ్యామ్ సుందర్ పహాడే సహకారంతో శుక్రవారం ఉచితంగా కుట్టుమిషన్ ను అందజేశారు. కుట్టుమిషన్ ఉంటే ఇంటి వద్దనే కుట్టు పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవచ్చని, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, లయన్స్ క్లబ్ ఎప్పుడూ పేదలకు, అవసరంలో ఉన్నవారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. కుట్టుమిషన్ అందుకున్న మహిళ లయన్ శ్యామ్ సుందర్ పహాడే, లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.