
పయనించే సూర్యుడుD.11.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రంలో ఉన్న లింబాద్రి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి జాతర నవంబర్ఈ నెలలో జరగనున్న ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం లింబాద్రి గుట్ట (నింబాచల) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక జాతర సందర్భంగా నిర్వహించనున్న స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ ప్రధాన అర్చకులు వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వచనాలు అందజేశారు.