
మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించాలి
మ్యాగ్నెట్ స్కూల్ కరస్పాండెంట్ ఎండి వాజిద్ పాషా
( పయనించే సూర్యుడు అక్టోబర్ 10 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను ఏర్పాటు చేసి ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం. పాఠశాల కరస్పాండెంట్ వాజిద్ పాషా మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టమైనదని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాని కి బతుకమ్మ పండుగ ప్రత్యేక అని తమ సంస్కృతి సంప్రదాయాలను వచ్చే తరానికి అందించే విధంగా ప్రతి పండుగను మా పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వాజిత్ పాషా తో పాటు కరికులం డైరెక్టర్ వినోద్ పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్ వైస్ ప్రిన్సిపల్ ఆసిఫ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.