
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల నూతన విద్యాశాఖ అధికారిగా ఆదినారాయణ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన పద్మావతి, రామ్ సింగ్ నుండి ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలోని ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ, ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ ఐక్యతతో పనిచేయాలని కోరారు. తాను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని తెలియ జేశారు. అనంతరం ఎంఈఓను మండల ఉపాధ్యాయులు శాలువ పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అసదుద్దీన్, జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుజాత, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాఘవేంద్ర, పి.ఆర్.టి.యు రుద్రూర్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ దస్తగీర్, రాష్ట్ర పి.ఆర్.టి.యు అసోసియేట్ అధ్యక్షులు రబ్బాని, మండల కార్యవర్గ సభ్యులు, పి.ఈ.టిలు, సి.ఆర్.పిలు అంబర్ సింగ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.