
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కాంతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు చున్నుపాషా కార్యక్రమంలో పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో, విద్యారంగ అభివృద్ధిలో ఆజాద్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.