
కూటమి బలం, ప్రజల ఆశీర్వాదంతో బరిలోకి బుచ్చివెంకాయమ్మ.. నడవపల్లి అభివృద్ధే నా సంకల్పం పయనించే సూర్యుడు నవంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం: కాట్రేనికొన మండలం నడవపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామ ప్రజలు ఆశీర్వదించి బలపరచిన, కూటమి తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి దంతులూరి బుచ్చివెంకాయమ్మ పోటీ చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మరియు దాట్ల పవన్, నాగిడి నాగేశ్వరరావు బలపరిచిన, మద్దతిచ్చిన కూటమి అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరగనున్న పోలింగ్లో తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ముద్ర వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె గ్రామ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, నడవపల్లి గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తానని తెలిపారు. గ్రామ ప్రజలందరినీ కలుపుకొని బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటానని, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి కుటుంబ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని బుచ్చివెంకాయమ్మ హామీ ఇచ్చారు.