
పయనించే సూర్యుడు అక్టోబర్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని మున్సిపాలిటీ ఆఫీస్ దీనస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి కొద్దిపాటి వర్షానికి సంవత్సరానికి మూడు కోట్ల పైబడి పన్నులు వసూల్ అవుతున్న సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీసు దుస్థితి నాలుగు చినుకులు పడితేనే చుట్టూ నీరు చేరిపోయి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నది పట్టణ నడిబొడ్డున ఈ పరిస్థితి ఉంటే వీరినిర్వాహం సూళ్లూరుపేట పట్టణ శివారు ప్రాంతాలలో ఉత్తరాన సాయి నగర్ ఇసుకమిట్ట కాలనీ రాజీవ్ నగర్ అలాగే సోనియా గాంధీ నగర్ బాపూజీ కాలనీ సూళ్లూరు ఇక పట్టణానికి అతి చేరువలో ఉన్న వట్రపాలెం, మన్నారు పోలూరు ఇలా ఈ శివారు ప్రాంతాలలో పరిస్థితిని చూస్తే సూళ్లూరుపేట ఇది సామాన్యంగా గ్రామపంచాయతీగా కొనసాగుతున్నప్పుడే ఈ ప్రాంతాలలో ఒక మోస్తరు మట్టిరోడ్డు అయిన వేసి బాగా ఉండేది ప్రస్తుతం పట్టణం అనే మార్కు పొందిన తరువాత గత 12 సంవత్సరాలుగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు కానీ పార్టీ నాయకులు గాని రావడం రోడ్డులకు పూజలు చేయడం కల్లబొల్లి వాగ్దానాలు ప్రజల మీద రుద్దడం ఇంతటితోనే సరే మరల ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి ఇప్పుడు కూడా అదే మాటలు అదే పనులు చేసి ఇంకొక 15 రోజులు ప్రజలను మభ్యపెట్టే మాటలతో తిరుగుతారు కానీ పట్టణాన్ని అభివృద్ధి చేసే పని మాత్రం చేయడం లేదు ఎన్నికల పేరుతో కొంతమంది పార్టీ నాయకులను తృప్తిపరిచి వారిని పోషించడం పనే తప్ప పట్టణాన్ని అభివృద్ధి చేసే పని మాత్రం నిధులు కొరత అనే మాటలతో సరిపెట్టుకుంటారు గెలిచిన తర్వాత ఇది ప్రస్తుత సూళ్లూరుపేట పట్టణ పరిస్థితి సూళ్లూరుపేట పట్టణ ప్రజలు ఎప్పుడైనా మేల్కొని పట్టణానికి కావలసిన ప్రాథమిక సౌకర్యాలను కల్పించకపోతే ఇంటి పన్ను కట్టే ప్రసక్తే లేదని ప్రజలు ఎన్నికల ప్రచారానికి తమకు ఓట్లు వేయమని అడిగే కాబోయే వార్డు కౌన్సిలర్లను చైర్ పర్సన్ లను ఈ ప్రాంత అసెంబ్లీ శాసనసభ్యులను పార్టీ నాయకులను నిలదీయండి వివరించండి మీరు మాటలు చెప్పి వెళ్లిపోతే ఎన్నికల తదనంతరం మేము పన్నులు కట్టే ప్రసక్తే లేదని తేల్చి చెబితేనే వీరు పట్టణ అభివృద్ధికి పనులు చేపట్టే పరిస్థితి ఉంటుందని గుర్తుంచుకోవాలని పరిసర బాధిత ప్రాంతపు ప్రజలు మాట్లాడుకుంటున్నారు