
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయండి. తెలంగాణలోని ప్రముఖ కళాకారులందులు పాల్గొంటారు. తెలంగాణలోని కళాకారుల సంక్షేమమే పరమావధిగా, కళాకారుల బతుకుల్లో వెలుగులు నింపడానికి వారికి మేమున్నామని భరోసా నివ్వడానికి ఏర్పాటు చేసింది తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ టూరిజం మరియు భాషా సాంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్న. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు కళాకారులందరూ గూడు చెదిరిన పక్షుల వలె ఎక్కడికి అక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకొని తమ ఉద్యమాలను కొనసాగించారని ఇకపైన అన్ని సంస్థలను కలిపి ఒకే గూడు కిందికి తీసుకువచ్చి ఒకే సంఘం గా ఉండాలని ప్రధాన ఉద్దేశంతో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అనేది స్థాపించి పోరాడుదాం తెలుగు ఫోక్ అసోసియేషన్ అనే పేరుతో మీ ముందుకు వస్తున్నామని అన్నారు. నవంబర్ 3న సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి ఈ యొక్క ఫోక్ నైట్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమంలో తెలంగాణలోన కళాకారులందరూ పాల్గొంటారని వారి ఆట,పాట అందరిని ఆహ్లాద బరితులను చేస్తోందని అదే విధంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజాసంఘాల వారు హాజరవుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి కళాకారులు తరలివస్తున్నారని ఈ కార్యక్రమం ఒక జానపద జాతర తలపిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిర్విరామంగా సభను వింజవంతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారని వారి కృషి హర్షించదగ్గ విషయమని అన్నారు ముఖ్యంగా ఈ సభ నిర్వహించడానికి ముందుకు వచ్చిన సిరిసిల్ల కళాకారులను ఆయన అభినందించారు.