
సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ
తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన
( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )ఫరూక్ నగర్ మండలం కాశిరెడ్డి గూడ గ్రామంలో సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రామలింగం గౌడ్ మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ నీటిని ఎంతో పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. తాగునీటిని, వర్షపు నీటిని వృధా చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా, గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చెత్త బండ్లకు అందించాలని కోరారు. పారిశుధ్యం, నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్,ఉప సర్పంచ్, గ్రామపంచాయతీ సెక్రటరీ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.