
పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ గణేష్ విగ్రహానికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రత్యేక పూజల అనంతరం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.అనంతరం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పోలీస్ సిబ్బంది కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు, వికారాబాద్ అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్, భైంసా ఏ ఎస్ పి సాయి కిరణ్, ఐపీఎస్, నిర్మల్ డి.ఎస్.పిశ్రీనివాస్, 14 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.