
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల ని భైంసా మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భైంసా పట్టణంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగియడంతో ఎస్పీ డా. జానకీ షర్మిల కు చైర్మన్ తూమొల్ల దత్తాత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అందించిన సహకారం, భద్రతా ఏర్పాట్లను అభినందిస్తూ ఎస్పీ ని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు.