
రుద్రూర్, సెప్టెంబర్ 28 (పయనించే సూర్యుడు) : రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడ్డ రుద్రూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, పాత్రికేయులకు సోమవారం శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముల్తాని ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరిగే మంచి చెడులను, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిలా నిలిచి బాధితుల సమస్యలను వెలుగులోకి తీస్తు ప్రజా గొంతుకగా నిలుస్తున్నారని అన్నారు. సమాజ స్థితిగతులపై ప్రజలను చైతన్య పరిచింది జర్నలిస్టులే అని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో రుద్రూర్ విలేజ్ ముస్లిం మైనార్టీ కమిటీ కార్యదర్శి షేక్ సుభాని, ఉపాధ్యక్షులు కలీం ఖురేషి, సహాయ కార్యదర్శి కాజా ఖురేషి, కోశాధికారి మొహమ్మద్ ఇక్రమ్, షామిర్ ఖురేషి, ఎండి జమీల్,షేక్ జకీర్, సాదీక్, సమీర్, ఆఫ్జాల్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.