
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ఉన్న బెల్టు షాపులను నిషేధించాలని సోమవారం ప్రజావాణిలో గ్రామపంచాయతీ పాలకవర్గం వినతి పత్రం అందజేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పి. గంగమ్మ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజల ఆరోగ్య దృష్టా షాపులను నిషేధించాలని తీర్మానించారు. ఎవరైనా తీర్మానాన్ని అతిక్రమించి బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే గ్రామపంచాయతీ నుండి 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని నిర్ణయించారు. వినతి పత్రం అందించిన వారిలో గ్రామ సర్పంచ్ పి. గంగమ్మ -గంగారాం, ఉప సర్పంచ్ టి. అర్చన తదితరులు ఉన్నారు.