
నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )విజయదశమి (దసరా) పండుగ పురస్కరించుకుని కొత్తూర్ మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామపంచాయతీ కార్మికులకు విస్లావత్ బాసు నాయక్ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు దసరా కానుకగా దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పండుగ వేళ గ్రామపంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు అందించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి శ్రమ వల్లే గ్రామం స్వచ్ఛంగా అలరారుతోందని కొనియాడారు. వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.